పాక్ జోరు..దక్షిణాఫ్రికా బేజారు

SMTV Desk 2017-06-08 12:10:07  pakisthan, champions trophy, south africa, win by pak,

బర్మింగ్ హామ్, జూన్ 08‌ : ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణుడి జోరుతో పాకిస్తాన్ కు అనుకూల ఫలితం దక్కింది. వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహాణకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే చివరగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిన విజయాన్ని ఖరారు చేశారు. భారత్ చేతిలో ఘోర పరాభవంతో ఛాంపియన్స్ ట్రోపీని ఆరంభించిన పాకిస్థాన్ కు దక్షిణాఫ్రికాతో తొలివిజయం లభించింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో ప్రతిభ కనబర్చిన పాక్ బౌలర్లు దక్షి ణాఫ్రికాను నిర్ణీత ఓవర్లలో 8 వికేట్లు నష్టపోయి 219 పరుగులకు పరిమితం చేశారు. ఆ తరువాత వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి పాక్ 27 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ సూత్రం ప్రకారం అప్పటికి పాక్ మెరుగైన స్థితిలో ఉంది. దీంతో 19 పరుగుల తేడాతో విజేతగా నిల్చినట్లు ప్రకటించారు. బాబర్ అజామ్ (31), షోయబ్ మాలికి (16) బ్యాటింగ్ లో ఉన్నారు. ఓపెనర్లు అజహర్ అలీ(9), జమాన్ (31) లతో పాటు మహ్మద్ హఫీజ్(26) లు ఔటయ్యారు. ఈ ముగ్గురినీ మోర్ని మోర్కెలే ఔట్ చేశాడు. తొలి వికెట్ కు 40 పరుగులు జోడించి ఛేదనలో పాక్ కు శుభారంభం అందించిన ఓపెనర్లను ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చిన మోర్కెల్.. తర్వాత అజామ్ తో మూడో వికెట్ కు 53 పరుగులు జోడించి ఇన్సింగ్స్ కు స్థిరత్వం తెచ్చిన హఫీజ్ ను కూడా ఔట్ చేశాడు. అంతకుముందు పాక్ బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా విలవిలలాడింది. 219 పరుగులను అతికష్టం మీద పూర్తి చేసింది. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ లో ఫలితం భారత్ కు అనుకూలంగా ఉంటుందని క్రీడా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అయితే సెమిఫైనల్లో భారత్ మరో మారు పాకిస్థాన్ తో తలపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.