ఇకపై షిర్డీ దర్శనం గంటలో

SMTV Desk 2017-06-07 11:26:59  shirdi air port started in two weeks , maharastha air port development company vice-president suresh kaakani

హైదరాబాద్, జూన్ 7: షిర్డీ వెళ్లే శ్రీ సాయిబాబా భక్తులకు శుభవార్త. ఇకపై బాబాను కొన్ని గంటల్లో దర్శించుకొనే అదృష్టం. షిర్డీ ఎయిర్ పోర్టు సిద్ధం అవ్వడంతో వచ్చే నెల మొదటి వారం నుంచి విమానాల రాకపోకలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కంపెనీ ఉపాధ్యక్షుడు సురేశ్ కాకనీ అధికారికంగా ప్రకటించారు. తొలుత ఎయిర్ ఇండియా సంస్థ విమాన సర్వీసులు నడుపుతుందని చెప్పారు. ఆ తర్వాత జెట్ ఎయిర్ వేస్ సంస్థ కూడా తమ విమానాలను షిర్డీకి తిప్పనున్నట్టు చెప్పారు. అయితే, షిర్డీకి విమాన రాకపోకలు కొనసాగించేందుకు మహారాష్ట్ర ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కంపెనీకి అనుమతి లభించాల్సి ఉందని, వచ్చే రెండు వారాల్లో అనుమతి లభించే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించారు.