ఆఫ్ఘనిస్తాన్ లో మరో సారి బాంబు పేలుళ్లు

SMTV Desk 2017-06-06 18:24:27  afghanistan, masid,

ఆఫ్ఘనిస్తాన్, జూన్ 6 : ఇటివల అఫ్గానిస్తాన్ లో రోజుల వ్యవధిలోనే పలుసార్లు బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం మసీద్ దగ్గర బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ళలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి అధికారులు మాట్లాడుతూ మసీద్ భయట ఉన్న మోటార్ సైకిల్ లో ఎవరో దుండగులు బాంబు అమర్చారని, అయితే మసీద్ లో ఒక కార్యక్రమం జగుతుండగా ఈ పేలుళ్లు సంభవించాయని ఈ దాడి పట్ల ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. తమ దేశం లో ప్రతి రోజు ఎక్కడో చోట దాడులు జరుగుతుండటం ప్రజలకు భయందోళనలు కలిగిస్తున్నారాని అధికారులు చెప్పారు.