ఇజ్రాయిల్ లో భారత పార్లమెంట్ సభ్యుల సందర్శన

SMTV Desk 2017-06-06 18:19:02  irrigation use, a group of indian parliamentarians,lsrael

హైదరాబాద్, జూన్ 6 : సాగునీటి వినియోగంలో అనుసరిస్తున్న నూతన పద్ధతుల అధ్యయనం కోసం ఇజ్రాయిల్ చేరిన భారత పార్లమెంట్ సభ్యుల బృందం సోమవారం కిబుట్జులోని నాందాన్ జైన్ కంపెనీని, టెలీ అవీవ్ లోని డీశాలినేషన్ ప్లాంట్ ను సందర్శించింది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే సాగునీటి పరిజ్ఞానం గురించి, సముద్రపు నీటిని శుద్ధీకరించి సాగునీరుగా వినియోగించడం గురించి లోతుగా అధ్యయనం చేసి అనంతరం 15 బిలియన్ డాలర్ల తో ఇంటెల్ కొనుగోలు చేసిన మొబీలియో కార్ల తయారీ ప్లాంట్ ను సందర్శించింది. ఆ తర్వాత ఇజ్రాయిల్ పార్లమెంట్ కార్యదర్శి యూడీ ఎడీల్ స్టీన్ తో సమావేశమై ఇజ్రాయిల్ పార్లమెంట్ విధానాలను, సమావేశాల నిర్వహణతీరును, చట్టాల రూపకల్పన తదితర అంశాలను తెలుసుకుంది. టీఆర్ఎస్ ఎంపీ జీతేందర్ రెడ్డి సహా 11 మంది ఎంపీలున్న ఈ బృందానికి పార్లమెంటరీ వ్యవహారాల సహాయం మంత్రి ఎస్ఎస్ ఆహ్లువాలియా నాయకత్వం వహిస్తున్నారు. ఎంపీల బృందం ఇజ్రాయిల్ లో మూడు రోజుల పాటు పర్యటిస్తుంది. భారత ప్రధాని మోదీ ఇజ్రాయిల్ సందర్శనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ పర్యటన ఏర్పాటు చేశారు.