ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం ప్రత్యేక దృష్టి

SMTV Desk 2017-06-06 18:16:44  central ministar, venkaih naidu, ap, rahul gandhi

న్యూఢిల్లీ, జూన్ 6 : ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని, ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప్రత్యేక ప్రాతిపదికన పరిష్కరిస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, విద్యుత్, గృహాలు, రామగుండం ఎరువుల తయారీ పరిశ్రమ పునఃప్రారంభం, నగరాల అభివృద్ధి తదితర అంశాలపై కేంద్రం ప్రత్యేక దృష్టితో పర్యవేక్షిస్తుందన్నారు. గుంటూరు సభలో ఏపీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, ప్రధాని మోదీలను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై స్పందిస్తూ..ఇచ్చిన హామీ మేరకు ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ... విభజన చట్టంలో ఈ అంశాన్ని ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను పదేళ్ళలో అమలు చేయాలని ఉన్నా..బీజేపీ మాత్రం పలు హామీలను మూడేళ్ళలోనే నెరవేర్చిందని మిగిలిన వాటిని నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరిస్తామన స్పష్టం చేశారు.