ఎయిరిండియాను ప్రైవేటీకరించాల్సిందే!!

SMTV Desk 2017-06-06 16:35:48  air india, arun jaitley, privatization, diginvestment air india,

న్యూఢిల్లీ, జూన్ 6 : ఎయిరిండియాను ప్రైవేటీకరించాల్సిందేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయ పడ్డారు.రుణ భారంతో కుంగుతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రభుత్వం 15 ఏళ్ల క్రితమే ప్రైవేటీకరించాల్సి ఉండిందని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు ఎయిర్ లైన్స్ సమర్థవంతంగా పనిచేస్తుండడంతో దేశీయంగా పౌరవిమానయాన రంగం మెరుగు పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 50 వేల కోట్ల రుణభారం ఉన్న ఎయిరిండి యాను ప్రజాధనంతో నిలబెట్టేందుకు ప్రయత్నించడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు. కేవలం 14 శాతం మార్కెట్ వాటా కోసం దాదాపు 55 వేల నుండి 60 వేల కోట్ల ప్రజాధనాన్ని ధారపోయడం సరికాదన్నారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించాలన్న నీతి ఆయోగ్ అభిప్రాయంతో తానూ ఏకీభవిస్తానని ..తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.