చాంపియన్స్ ట్రోఫీకి సిద్దం అవుతున్న టీంఇండియా

SMTV Desk 2017-05-28 12:53:33  indian team,Ravichandndran,virat kohli,rohit sharma

న్యూజిలాండ్, మే 28 : ఓవల్స్ లో జరుగనున్న చాంపియన్ ట్రోఫీకి భారత్ సన్నద్ధం అయింది. ఈ మినీ వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు రెండు వామప్ మ్యాచ్ లు ఆడనుంది. ఫస్ట్ వామప్ మ్యాచ్ లో ఈ రోజు (ఆదివారం) న న్యూజిలాండ్ తో తలపడనుంది. రెండవ మ్యాచ్ లో ఈ నెల 30న బంగ్లాదేశ్ తో ఢీ కొనబోతుంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు, ఫేసర్ మహ్మద్ షమికి ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. అశ్విన్ గాయం కారణంగా ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఆడలేదు. అతను ఎప్పుడు కోలుకుంటాడన్నది ఇప్పుడు అభిమానుల ముందున్న ప్రశ్న. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో మన బ్యాట్స్ మెన్స్ కూడా అంతగా రాణించలేదు. వారిలో కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తదితర ఆటగాళ్ళు ఉన్నారు. వీళ్ళు గాడిలో పడడానికి ఈ వామప్ మ్యాచ్ లే ఉపయోగపడనున్నాయి.