మన్మోహన్ కు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

SMTV Desk 2017-09-26 14:26:40  Prime Minister, Manmohan Singh, modi, Birthday wishes.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26 : నేడు 85వ పుట్టిన రోజు జరుపుకుంటున్న భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంతో జీవించాలని తాను కోరుకుంటున్నట్లు మోదీ పేర్కొన్నారు. 1932లో పంజాబ్‌లో జన్మించిన మన్మోహన్.. 2004 లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 2014 వరకు నిర్వర్తించారు. అంతేకాకుండా ఆయన 1991లో కేంద్ర ఆర్థికమంత్రిగా కూడా బాధ్యతలను నిర్వహించారు. కాగా మోదీతో పాటు పలువురు భాజపా నేతలు మన్మోహన్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు.