బాధితులకు నా ఇన్నింగ్స్ అంకితం

SMTV Desk 2017-06-06 12:53:55  yuvaraj singh, india, cancer

లండన్, జూన్ 6 : చాంపియన్స్ ట్రోఫీ లో ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆడిన ఇన్నింగ్స్ ను క్యాన్సర్ జయించిన వారికీ అంకితం ఇస్తున్నట్లు యువరాజ్ సింగ్ తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా జూన్ తొలి ఆదివారం క్యాన్సర్ డే ను పురస్కరించుకొని యువరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలాగే లండన్ లో జరిగిన ఉగ్రవాద దాడి లో బాదితులైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు చెప్పాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 32 బంతుల్లో 52 పరుగులు చేసిన యువరాజ్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. కీలకమైన సమయంలో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడిన యువరాజ్ భారత్ భారి స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఈ మ్యాచ్ లో 29 బాల్స్ లో అర్ధ శతకం చేసిన యువరాజ్ చాంపియన్స్ ట్రోఫీ లో వేగావంతమైన ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.