ఈ యాప్ వాడండి.. పెట్రోల్, డీజిల్ పై డిస్కౌంట్ పొందండి..!

SMTV Desk 2017-09-22 12:08:41  Digitalization, Crude oil, petrol, diesel, Bhim - Making India cashless.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 : అంతర్జాతీయ, దేశీయ క్రూడ్ ఆయిల్ ధరల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో వాహనదారులకు కాస్త ఊరట కలిగించే విషయాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల కేంద్రం.. దేశాన్ని డిజిటలైజేషన్ చేస్తూ ప్రవేశపెట్టిన "భీమ్ యాప్" ను ఇప్పుడు ఇంధన చెల్లింపులకు ఉపయోగిస్తే, లీటర్ పెట్రోల్ పై 49 పైసలు, లీటర్ డీజిల్ పై 41 పైసల డిస్కౌంట్ లభిస్తుందని అధికారికంగా ప్రకటించింది. కేవలం ఈ యాప్ ద్వారా మాత్రమే తగ్గింపు వర్తిస్తుందని సూచించింది.