ఆ దుర్మార్గుడిని చంపేయండి.. ప్రధానికి విద్యార్థిని లేఖ

SMTV Desk 2017-09-20 14:32:48  Up government, prime minister, Narendra modi.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20 : మహిళలపై జరుగుతున్న అరాచకాలను తగ్గించే దిశగా యూపీ ప్రభుత్వం ఎన్ని చర్యలను చేపట్టినా, ఫలితం మాత్రం పెద్దగా కనబడడం లేదు. తాజాగా ఓ కాలేజ్ విద్యార్థిని తానూ అనుభవిస్తున్న నరకం గురించి ప్రధాని మోదీకి వివరి౦చి తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ఒక లేఖ రాసింది. పూర్తి వివరాలలోకి వెళితే... ముజఫర్ నగర్ కు చెందిన ఓ విద్యార్థినిని ఏడాది కాలం నుంచి ఒక ఆకతాయి వెంటాడుతూ వేధిస్తున్నాడు. ఆ బాధితురాలు ఎన్నిసార్లు తన వెంట పడవద్దని చెప్పిన ఆ వ్యక్తిలో మార్పు రాకపోగా, తీవ్ర వేధింపులకు గురి చేశాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ విద్యార్థిని తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో " నేను ఇంటి నుండి బయటకు రావాలంటేనే భయంగా ఉందని, ఒక దుర్మార్గుడు నన్ను రోజు వెంటాడుతూ వేధిస్తున్నాడని ఆ లేఖలో పేర్కొంది. ఆ టార్చర్ ను భరించలేకపోతున్నా.. నాకు చాలా భయంగా ఉంది. వెంటనే చర్యలు చేపట్టి ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా" అని పేర్కొంది. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.