నల్లధన ప్రవాహా నిబంధనను నియంత్రించిన కేంద్ర ప్రభుత్వం

SMTV Desk 2017-06-05 19:41:24  16 laks companies ,corporate, minisrty

హైదరాబాద్, జూన్ 5 : దేశంలో నల్లధన ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఉత్తుత్తి (షెల్) కంపెనీ లపై కొరడా ఝుళీపించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఈ సంస్థలో డైరెక్టర్లు గా ఉన్నవారు మరే ఇతర సంస్థలో డైరెక్టర్ గా చేరకుండా నిరోధించేందుకు వారిపై ఐదేండ్ల వరకు అనర్హత వెట్టు వేయనుంది. మాములుగా షెల్ కంపెనీ లను అక్రమ నిధుల లాండరింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. దేశంలో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లనని రుజువైనవాటి రిజిస్టేషన్ (ఆర్ వో సీ) వద్ద దాదాపు 16 లక్షల సంస్థలు పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో మూడు లక్షల కంపెనీల పై కేంద్రం నిఘా పెట్టింది. షెల్ కంపెనీలనని రుజువైనవాటి రిజిస్టేషన్ రద్దు చేయడంతో పాటు వాటి డైరెక్టర్లపైన కఠిన చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దీర్ఘకాలంగా ఆర్ధిక నివేదికలు సమర్పించని సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు షెల్ కంపెనీ డాటా బేస్ ను తయారు చేసే పనిలో నిమగ్నమైన కార్పోరేట్ మంత్రిత్వ శాఖ.