ఆ ఇద్దరు హీరోలతో నటించాలని హనీప్రీత్ కలలు కనేదట..!

SMTV Desk 2017-09-14 13:55:00  GURMITH SINGH BABA, HONEY PREETH SINGH, SALMAN KHAN, AKSHAY KUMAR.

చండీఘడ్, సెప్టెంబర్ 14 : డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్ విషయంలో రోజుకో వార్త సంచలనం రేపుతోంది. తాజాగా ఆమె గురించి ఒక వార్త బయటపడింది. హనీప్రీత్ కు బాలీవుడ్ టాప్ హీరోస్ అయిన సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించాలనే కోరిక ఉండేదట. అది గమనించిన బాబా గుర్మీత్ ఎలాగైనా హనీప్రీత్ ను పెద్ద హీరోయిన్ ను చేయాలని భావించడమే కాకుండా ఏకంగా ముంబైలో ఖరీదైన నాలుగంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ భవనంలో ఒక స్టూడియోను కూడా ఏర్పాటు చేశాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. వారిద్దరి ఆలోచనలన్ని గుర్మీత్ జైలు పాలవడంతో తలక్రిందులుగా మారాయి.