ఆ లిస్టులో రాందేవ్ బాబాను కూడా చేర్చండి: దిగ్విజయ్

SMTV Desk 2017-09-12 12:22:37  Congress leader Digvijaya Singh, Baba Ramdev Yoga Teacher, patanjali products.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ను ఒక దొంగ అంటూ దిగ్విజయ్ సంచలన ప్రకటన చేశారు. ఇటీవలే ఆయన ప్రధాని నరేంద్ర మోదీపైనే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రాందేవ్ బాబాను అతని అనుచరులను కూడా అసభ్య పదజాలంతో దూషిస్తూ ట్విట్స్ చేశారు. అఖిల భారతీయ ఆకార పరిషత్ విడుదల చేసిన పద్నాలుగు మంది దొంగ బాబాల జాబితాలో రాందేవ్ బాబా పేరు లేకపోవడం తనను నిరాశకు గురి చేసిందంటూ దిగ్విజయ్ అన్నారు. అసలు పతంజలి బ్రాండ్ పేరుతో అన్ని నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తూ, వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దొంగ బాబాల లిస్టులో రాందేవ్ బాబాను కూడా చేర్చాలని డిమాండ్ చేసారు. మనుస్మృతి ప్రకారం కాషాయ వస్రాలు ధరించే వ్యక్తి వ్యాపారాలు చేయొచ్చా? అనే విషయాన్ని కూడా తెలియజేయాలని కోరారు.