ఒక వైపు టాపర్... మరో వైపు బ్యాంకు లో అవకతవకలు

SMTV Desk 2017-06-05 12:25:43  Patna,Kolkatta, Chitfund company, Zarkhand state

పాట్నా, జూన్ 5 : నేటి కాలంలో చాలా మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సాయపడడానికి చదువుకుంటూ, ఖాళీ సమయంలో ఏదైనా చిన్నపాటి ఉద్యోగం చేస్తూ జీవితాన్నిగడుపుతుంటారు. కాని ఒక వ్యక్తి మాత్రం ఉద్యోగాన్ని చేస్తూ, అందర్నీ ఒక విద్యార్థిగా మోసం చేశాడు. వివరాల్లోకి వెళ్ళితే పుట్టిన తేదీని తప్పుగా చూపించి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి, ఆర్ట్స్ విభాగంలో టాపర్ గా నిలిచిన గణేష్ కుమార్ అనే వ్యక్తి ఓ చిట్ ఫండ్ కంపెనీ కుంభకోణంలో ముఖ్య పాత్ర పోషించాడని పాట్నా సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మను మహారాజా తెలిపారు. కోల్ కత్తా కేంద్రంగా నడుస్తున్న ఓ చిట్ ఫండ్ కంపేనీకి చెందిన జార్ఖండ్ శాఖ గిరిదహ్ లో ఉంది. ఆ బ్యాంక్ లో చేరిన గణేష్ 15 లక్షల మేరకు అవకతవకలు చేశాడు. అసలు విషయం తెలిసి తిరిగి డబ్బు ఇవ్వాలని, అందరు ఒత్తిడి పెంచడంతో 2013లో అక్కడి నుండి పాట్నాకు వెళ్ళిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడానికి తన వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించుకున్నాడు. పోలీసుల విచారణ తర్వాత గణేష్ ను శనివారం కోర్టులో ప్రవేశపెట్టగా, అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.