కోహ్లీపై నిప్పులు చెరుగుతున్న భారతీయులు... ప్రశంసిస్తున్న పాక్ అభిమానులు

SMTV Desk 2017-09-11 12:08:15  Kohli, Cricket, Social Media, Kohli Tweets

ముంబై, సెప్టెంబర్ 11: గురుపూజోత్సవ దినోత్సవం సందర్భంగా భారత క్రికెట్ సారధి విరాట్ కోహ్లీ తన ట్వీటర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌ కారణంగా భారత నెటిజన్లు కోహ్లీపై నిప్పులు చెరగగా, దాయది దేశం పాకిస్థాన్‌లో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే... కోహ్లీ చేసిన పోస్ట్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్లర్ల పేర్లు కనబడుతుండగా, వాటి ముందు తాను కూర్చున్న ఫొటో ఉంది. కాగా, ఈ జాబితాలో భారతీయ క్రికెట్ దిగ్గజాలు గవాస్కర్, కుంబ్లేల పేర్లు లేకపోవడం గమనార్హం. దీంతో భారత అభిమానులు ఆగ్రహం వెళ్లకక్కు‌తున్నారు. అయితే ఈ జాబితాలో పాకిస్థానీ క్రికెటర్లు ఇమ్రాన్ ఖాన్, జావెద్ మియాందాద్, ఇంజమమ్ ఉల్ హక్‌ల పేర్లు ఉండటంతో కోహ్లీ పాక్ అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు.