నల్లధన నిర్మూలనపై మోదీ దృష్టి

SMTV Desk 2017-09-08 18:28:21  Eradication of black money, Modi government, 2.09 lakhs companys,Enforcement Agency, fake companies

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 08 : గత నోట్ల రద్దు అమలు నుంచి మోదీ సర్కార్ నల్లధన నిర్మూలనపై పూర్తి దృష్టి సారించింది. ఈ మధ్య కాలంలో ఈ నల్లధన నిర్ములనాను ఇంకా వేగవంతం చేసింది. ఇటీవల 2.09 లక్షల డొల్ల కంపెనీల గుర్తింపును రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా వాటి వెనక ఉన్న ‘వాస్తవ లబ్ధిదారుల’ను గుర్తించే పనిలో నిమగ్నమైపోయింది. ఏళ్ల తరబడి వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉన్న 2.09 లక్షల నమోదిత కంపెనీల గుర్తింపును ఇటీవల ఆర్థిక శాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉన్న 2.09 లక్షల నమోదిత కంపెనీల గుర్తింపును ఇటీవల ఆర్థిక శాఖ రద్దు చేయడం జరిగింది. గుర్తింపు రద్దైన డైరెక్టర్లు మూడేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు రిటర్నులు దాఖలు చేయకపోతే కంపెనీ ఈ పదవిలో ఉన్న రద్దు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో డొల్ల కంపెనీల వెనుక ఉన్న ‘వాస్తవ లబ్ధిదారుల’ను గుర్తించే చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఆయా కంపెనీల వెనుక ఉన్న వ్యక్తులు, వారి పాత్రకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు వివరాలు సేకరిస్తున్నాయని వెల్లడించింది.