కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి

SMTV Desk 2017-06-04 16:33:45  terrorist, army,jammukashmir

కాశ్మీర్, జూన్ 4 : జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్ళీ చెలరేగిపోయారు. కాశ్మీర్ లో శనివారం ఆర్మీ వాహన శ్రేణి పై ఉగ్రవాదులు మెరుపు దాడి దిగారు. ఉగ్రవాదులు చేసిన ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు చనిపోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ దాడి కుల్గాం జిల్లాలోని శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారి పై జరిగింది. రాజధాని శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముండా ప్లాజా సమీపంలో మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా అక్కడికక్కడే ఇద్దరు చనిపోయారు. దాడి చేసిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఎల్ఓసీ వెంట పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. శనివారం పుంచ్ జిల్లాలోని రెండు సెక్టర్ల్ లో భారత్ పోస్టులు జనావాసాలు లక్ష్యంగా చేసుకున్న మోర్టార్ షెల్స్ తో ఉగ్రవాదులు దాడి చేయడంతో కస్బా షాహుపూర్ బెల్ట్ లో ఒక మహిళకు తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.