నేడు శశికళతో సమావేశం కానున్న ఉపప్రధాన కార్యదర్శి దినకరన్!

SMTV Desk 2017-09-04 12:29:43  Central Penitentiary Penitentiary, Principal Secretary Shashikala,Deputy Chief Secretary Dinakaran

చెన్నై, సెప్టెంబర్ 4 : ఇటీవల అక్రమాస్తుల కేసులో పట్టుబడ్డ అన్నాడీఎంకే బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్తున్న ప్రధాన కార్యదర్శి శశికళతో ఆ పార్టీ బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ నేడు సమావేశం కానున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 12వ తేదీన ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్వహించనున్న అన్నాడీఎంకే సర్వసభ్య భేటీతో పాటు ప్రస్తుత రాజకీయాలపై శశికళతో ఆయన చర్చించనున్నారు. మరోవైపు, శశికళ తరపున కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఈ పిటిషన్ కు సంబంధించి సీనియర్ లాయర్లతో చేపట్టిన చర్చల వివరాలను కూడా శశికళకు ఆయన వివరించనున్నట్లు వెల్లడించారు.