మరోసారి అణు పరీక్ష నిర్వహించిన ఉత్తరకొరియా

SMTV Desk 2017-09-03 14:51:37  utharakoriya, dhakshinakoriya, dydrozan, kim jang un

టోక్యో, సెప్టెంబర్ 3 : మరో సారి ఉత్తరకొరియా అణు పరీక్షతో నేడు ఉదయం పరీక్ష నిర్వహించిందని దక్షిణ కొరియా వెల్లడించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేసినట్లు, దానిని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పరిశీలించారని చెబుతూ ఫోటోలు విడుదల చేసింది. అలా విడుదల చేసిన కొన్ని గంటల్లోనే అణుపరీక్షను ఉత్తరకొరియా నిర్వహించిందని దక్షిణ కొరియా తెలిపింది. అణు పరీక్షల నేపథ్యంలో ఉత్తరకొరియాలోని ఈశాన్య ప్రాంతమైన సున్‌ గ్జిబేగమ్‌ లో 5.1 తీవ్రతతో పేలుడు సంభవించినట్లు దక్షిణకొరియా తెలిపింది. ఈ పేలుడు ధాటికి ఉత్తరకొరియాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిందని దక్షిణ కొరియా జపాన్ వెల్లడించింది.