కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తి

SMTV Desk 2017-09-03 12:51:03  narendra modi, election, ramnath kovindh, central cabinent

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 3 : మోదీ ఎలక్షన్ కేంద్ర కేబినెట్ నేడు కొలువు తిరింది. నలుగురు కేబినెట్ మంత్రులుగా రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారాలు చేశారు. కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ తో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు హజరయ్యారు. కొత్త మంత్రులకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. మిత్ర పక్షాలు జేడీయు సేవసేనకు పునర్వ్యవస్థీకరణలో చోటు లభించలేదు. శివసేన ఈ కార్యక్రమాన్ని బయట బహిష్కరించింది. పీయూష్ గోయల్ కూడా కేబినెట్ ప్రమోషన్ లభించింది. వీరితో కూడా రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. సహాయ మంత్రిగా ఉన్న నిర్మల సీతారామాన్ కూడా కేబినెట్ లో ప్రమోషన్ లభించడంతో వారిచే కూడా ప్రమాణం చేయించడం జరిగింది. 4 వ కేబినెట్ మంత్రిగా ముక్త అబ్బాస్ నఖ్వీ ప్రమాణం చేశారు. అలాగే తొమ్మిది మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.