మంత్రి పదవికి రాజీనామా చేసిన దత్తాత్రేయ

SMTV Desk 2017-09-02 15:40:13  BJP leader Dattatreya resigned as Union Minister, BJP president Amit Shah, meeting

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2 : భాజపా నేత దత్తాత్రేయ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేవలం మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేయడమే కానీ, ఎప్పటికీ పార్టీ అవసరాల కోసం పనిచేస్తానని అధిష్టానానికి దత్తాత్రేయ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ఈ విషయంపై ఆగస్టు 31న భాజపా అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అయి చర్చించినట్లు పేర్కొన్నారు.