సైరా డైరక్టర్ తో ప్రభాస్.. 200 కోట్ల బడ్జెట్..!

SMTV Desk 2020-01-04 13:13:43  

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఎవరితో సినిమా చేస్తాడన్నది ఇంకా తెలియలేదు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ సైరా నరసిం హా రెడ్డి డైరక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా చేస్తున్నాడని అంటున్నారు.

రాధాకృష్ణతో చేస్తున్న జాన్ మూవీ రిలీజ్ కాగానే సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. ఈ సినిమా కూడా 200 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. సైరా సినిమాతో సత్తా చాటిన సురేందర్ రెడ్డి సురేందర్ రెడ్డితో సినిమా చేయాలని ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈసారి మాత్రం ఈ కాంబో సినిమా పక్కా అంటున్నారు.