బాలీవుడ్ బాట పట్టిన మరో భామ

SMTV Desk 2019-12-13 11:40:15  

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో కుర్రకారు హృదయాలను శాలినీ పాండే దోచేసింది. చక్కని కనుముక్కు తీరుతో కుర్రకారుకి కుదురులేకుండా చేసిన ఈ అమ్మాయి, వరుస సినిమాలతో బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ అడపాదడపా అవకాశాలు పలకరించడమే కష్టమైపోయింది. దాంతో తమిళంలోను గట్టిగానే ట్రై చేసింది .. అయితే అక్కడ కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు వచ్చి వరించడం లేదు.

ఈ నేపథ్యంలో ఈ సుందరి బాలీవుడ్ బాట పట్టేసింది. మొత్తానికి ఆమె ప్రయత్నాలు ఫలించి గట్టి అవకాశమే చేతికి చిక్కింది. రణ్ వీర్ సింగ్ హీరోగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మనీశ్ శర్మ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శాలినీ పాండేను ఎంపిక చేశారు. దాంతో ఆమె ఫుల్ ఖుషీ అవుతోంది .. ఈ సినిమాతో తన దశ తిరిగిపోతుందని భావిస్తోంది.