రాహుల్ సిప్లిగంజ్ కు జోడీగా....!!

SMTV Desk 2019-12-14 12:09:47  

హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తరువాత మంచి కథల కోసం వెయిట్ చేస్తున్న ఆమె, కృష్ణవంశీ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం విశేషం. ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాను రూపొందిస్తున్నాడు. నట సామ్రాట్ అనే మరాఠీ మూవీకి ఇది రీమేక్.

ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం .. అనసూయ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (బిగ్ బాస్ 3 విజేత)ను తీసుకున్నారు. ఆయన జోడీగా శివాత్మికాను ఎంపిక చేశారట. ఇద్దరి కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించినట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చుతుండటం మరో విశేషం.