మహేశ్ బాబు కెరియర్లోనే ఇది అత్యధిక పారితోషికం

SMTV Desk 2019-12-13 11:42:55  

కథానాయకుడు మహేశ్ బాబు .. దర్శకుడు అనిల్ రావిపూడి చెరో భారీ హిట్ ఇచ్చి మంచి ఊపుమీద వున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకిగాను పారితోషికంగా మహేశ్ బాబుకి ఎంత మొత్తం ముట్టివుంటుందనేది అందరిలో ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారిపోయింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నిమిత్తం ఆయనకి 40 కోట్లవరకూ ముట్టిందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా పారితోషికం కింద ఆయన శాటిలైట్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ ను తీసుకున్నాడని అంటున్నారు. శాటిలైట్ .. డిజిటల్ హక్కులను కలిపి సన్ టీవీ వారు 30 కోట్లకు కొనుగోలు చేశారని అంటున్నారు. ఇక హిందీ డబ్బింగ్ హక్కుల రూపంలో 15 కోట్లకి పైగా వచ్చాయట. జీఎస్టీని మినహాయిస్తే, 40 కోట్ల వరకూ మహేశ్ బాబుకి ముట్టాయని అంటున్నారు. మహేశ్ బాబు కెరియర్లోనే ఇది అత్యధిక పారితోషికం అని చెప్పుకుంటున్నారు.