రజినీకాంత్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు

SMTV Desk 2020-01-04 13:11:52  

శ్రీ రెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది. అయితే తెలుగునాట కాస్టింగ్ కౌచ్ వివాదం పేరుతో సంచలనం సృష్టించి, పవన్ కళ్యాణ్ ని అసభ్యంగా బూతులతో తిట్టి చాల పాపులర్ అయ్యింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూనే, పవన్ కళ్యాణ్ ని, మెగా ఫ్యామిలీ ని వీలు చిక్కినప్పుడల్లా విమర్శలతో సమయం గడిపేస్తుంది. అయితే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టిస్తుంది.

తమిళ రాజకీయాలలో యాక్టీవ్ అయ్యేందుకు శ్రీ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఇష్టమని, వివాదాల్లో తలా దూర్చకుండా శాంత స్వభావంతో ఉంటాడని తెలిపింది. ప్రస్తుతం రాజకీయాల్లోకి రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. సొంతగా పార్టీ పెడతారో, లేదంటే ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తారో అందులోనే చేరతానని, ఆ పార్టీ కే మద్దతిస్తానని తెలిపింది. అంతేకాదు, రజినీకాంత్ కి తనలాగే విపరీతమైన దైవభక్తి అని తెలపటం జరిగింది.