భార్యకు ఉల్లినగలను ఇచ్చిన బాలీవుడ్‌ హీరో

SMTV Desk 2019-12-14 12:06:57  

స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఉల్లిగడ్డల ధరల పెరుగుదలపై తనదైన శైలిలో స్పందించాడు. తన భార్యకు ఉల్లిగడ్డలతో చేసిన చెవి దుద్దులు గిఫ్టుగా ఇచ్చారు. వాటిని ఆమె ఆనందంగా తీసుకోవడం ఇప్పుడు టాప్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యింది. జనరల్‌గా సెలబ్రిటీలు పెద్దగా సామాన్య ప్రజల సమస్యలపై స్పందించరు. వాళ్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించరు. మీడియా ముందు తప్పితే ఎక్కడా పెద్దగా కనిపించరు. తాజాగా ఉల్లిగడ్డలపై సోషల్ మీడియాలో, టిక్ టాక్‌లో వస్తున్న సెటైరికల్ వీడియోలు, పోస్టులకు తగ్గట్టుగా అక్షయ్ కుమార్ కూడా ఉల్లిగడ్డలపై స్పందించాడు. ఈ ప్రత్యేక ఉల్లి చెవి దుద్దులను కరీనా కపూర్‌కి చూపిస్తే ఆమె వద్దని చెప్పినా వాటిని కొనేసిన అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాకు గిఫ్టుగా ఇచ్చాడు. వాటిని ఎంతో ఆనందంగా తీసుకున్న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఉల్లి ధరల పెరుగుదలపై సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలుతున్న విషయం తెలిసిందే.