త్వరలో NEET UG 2020 నోటిఫికేషన్

SMTV Desk 2019-11-26 12:04:00  

ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)-2020 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే వెల్లడించనుంది. డిసెంబరు 2న నీట్(యూజీ)-2020 ప్రవేశ ప్రకటన వెలువడే అవకాశముంది.ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. డిసెంబరు 2 నుంచి 31 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. నీట్ పరీక్ష హాల్‌టికెట్లను వచ్చే ఏడాది మార్చి 27 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. మే 3న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ముగిసిన నెలరోజుల్లో అంటే.. జూన్ 4న ఫలితాలను వెల్లడించనున్నారు.OMR విధానంలో నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో సాధించిన మార్కులను పర్సంటైల్ స్కోరుగా ప్రకటిస్తారు. గతేడాది నోటిఫికేషన్ ప్రకారం నీట్ ప్రవేశ పరీక్షలో కనీసం 50 పర్సంటైల్ సాధించిన విద్యార్థులను అర్హులుగా గుర్తిస్తారు.ఇదిలా ఉండగా.. 2020 విద్యాసంవత్సరం నుంచి అన్ని వైద్యకళాశాలలు/ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలకు నీట్ ద్వారానే ప్రవేశాలలు కల్పించనున్నారు. ఎయిమ్స్, జిప్‌మర్ విద్యాసంస్థలు నీట్ పరిధిలోకే రానున్నాయి. ఇప్పటివరకు ఎయిమ్స్, జిప్‌మర్ సంస్థలు ఎంబీబీఎస్/ బీడీఎస్ ప్రవేశాలకు విడిగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి. అయితే నేషనల్ మెడికల్ కమిటీ యాక్ట్ ప్రకారం 2020 విద్యాసంవత్సరం నుంచి నీట్ ద్వారానే ఈ సంస్థల్లో ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది.