విజయ్ దేవరకొండకి అవార్డు ఇవ్వడానికి మీరెవరు?

SMTV Desk 2019-11-22 13:38:09  

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్‌ తాజాగా మూవీ మాఫియా అంటూ మరోసారి సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రంగోలీ అభిప్రాయంలో మూవీ మాఫియా అంటే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ అన్నమాట. ఈ సారి టాపిక్‌లోకి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా వచ్చారు. విషయం ఏంటంటే.. ఫిలిం కంపానియన్ అనే సంస్థ టాప్ 100 బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌ తీసి అందులోని నటీనటులకు మెడల్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, విజయ్ దేవరకొండ, తమిళ నటుడు ఫాహద్ ఫాసిల్ ఉన్నారు. ఈ విషయాన్ని తమ ట్విటర్ ఖాతాలో ప్రకటించారు. ఈ విషయం రంగోలీ దృష్టికి వచ్చింది. ఇక ఆమె ఆగుతారా? వరుస ట్వీట్లు చేసి ఏకిపారేశారు. ‘మూవీ మాఫియాకు చెందిన చెంచాగాళ్లు గొప్ప నటీనటులకు మెడల్స్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇలాంటి అడుక్కుతినే వెధవలు ఎప్పుడూ ఓ గొప్ప పని చేయలేదు. అలాంటిది ఇర్ఫాన్ ఖాన్, విజయ్ దేవరకొండలాంటి గొప్ప నటులు చేసే పనిని వాడుకునే హక్కు వారికి ఎవరు ఇచ్చారు? ముందు మీరున్న స్థానాలేంటో చేసుకోండి.. ఆ తర్వాత ఇతరులకు మెడల్స్ ఇవ్వండి. కొందరు మూవీ మాఫియా అయితే మరికొందరు భర్త మాఫియాను నమ్ముకుని బతికేస్తుంటారు. ఫేమస్ భర్తల పేర్లు వాడుకుని ఇతరుల నటన గురించి తప్పుగా మాట్లాడుతుంటారు? అనుపమ చోప్రాలాంటి గొప్ప జర్నలిస్ట్.. కరణ్ జోహార్ తీసిన ఫ్లాప్ సినిమా ‘కళంక్’ గురించి తెగ పొగిడేసింది. ఆమెకు ఇతర నటుల పనిని జడ్జ్ చేసే హక్కు ఉందా? వెళ్లు..వెళ్లి కిట్టీ పార్టీలు చేసుకోపో. ఇంకోసారి ఇలాంటి పనికిమాలిన సర్వేల్లో నా చెల్లి కంగనా రనౌత్ పేరు వాడితే కంగన నీ బండారం బయటపెడుతుంది’ అని కడిగిపడేశారు.