అల్లు అర్జున్ పాత్ర రివీల్ చేసిన సుకుమార్!!

SMTV Desk 2019-11-19 11:52:14  

సుకుమార్ తన తదుపరి సినిమాకి సంబంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేసుకుంటున్నాడు. అల్లు అర్జున్ కథానాయకుడిగా ఆయన ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఎర్రచందనం దొంగల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అందువలన శేషాచలం అడవుల్లో ఈ సినిమా షూటింగ్ చేయాలని దర్శక నిర్మాతలు భావించారు.

అయితే ఎంతగా ప్రయత్నించినా అక్కడి నుంచి అనుమతులు రాకపోవడంతో, థాయ్ లాండ్ అడవుల్లో షూటింగ్ జరపాలనే నిర్ణయానికి సుకుమార్ వచ్చినట్టు సమాచారం. ఎర్రచందనం అక్రమ రవాణాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను థాయ్ లాండ్ అడవుల్లోనే చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. స్మగ్లింగ్ తాలూకు లారీ డ్రైవర్ గా బన్నీ కనిపించే ఈ సినిమాలో, ఆయన జోడీగా రష్మిక కనిపించనుంది.