తెలుగు ఫ్యాన్స్ అప్సెట్

SMTV Desk 2019-10-30 15:29:55  

తెలుగులో ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్దెనే అని అందరు చెప్పేస్తారు. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో అలరించలేని పూజా డిజేతో హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత నుండి వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటుంది. మహేష్ తో మహర్షి హిట్ అందుకున్న పూజా హెగ్దె ఈమధ్యనే వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ లో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా చేస్తున్న పూజా హెగ్దె.. ప్రభాస్ జాన్ సినిమాలో కూడా నటిస్తుంది.

తెలుగులో ఎంత బిజీ హీరోయిన్ అయినా సరే అమ్మడికి బాలీవుడ్ ఛాన్స్ వస్తే మాత్రం అసలు వదలట్లేదు. ఆల్రెడీ మొహెజోదారో సినిమాతో ఫ్లాప్ చవిచూసిన పూజా హెగ్దె రీసెంట్ గా వచ్చిన హౌసె ఫుల్ 4తో మరోసారి నిరాశపరచింది. సినిమాలో ఆమెది చాలా తక్కువ పాత్ర అవడం ఆమె తెలుగు ఫ్యాన్స్ ను అప్సెట్ చేసింది. టాలీవుడ్ లో ఆమె డేట్స్ కోసం క్యూ కడుతుంటే పూజా హెగ్దె మాత్రం బాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలను చేస్తుంది. హౌస్ ఫుల్ 4 రిజల్ట్ తో అమ్మడి నిర్ణయంలో కూడా తేడా వస్తుందని చెప్పొచ్చు.