జగన్‌ ప్రభుత్వం రివర్స్‌లో నడుస్తుంది

SMTV Desk 2019-10-21 19:02:24  

వైసీపీ నేతలు పిచ్చి వేషాలు వేస్తే కేంద్రం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించారాయన. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. జగన్‌ ప్రభుత్వం రివర్స్‌లో నడుస్తోందని విమర్శించారు. పోలవరం పనులు ఆలస్యం వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి కుటుంబాలు ఏపీకి పట్టిన పీడగా వ్యాఖ్యానించారు సుజనా. ఆ రెండు కుటుంబాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు.