ఇండియన్ వర్కర్లపై దాడి

SMTV Desk 2019-10-17 15:07:45  

కువైట్‌లోని మన్గాఫ్‌లో కారు గారేజ్‌లో పని చేస్తున్న ఇద్దరు ఇండియన్ వర్కర్లపై అక్కడి స్థానికులు దాడికి పాల్పడ్డారు. కారు మరమ్మత్తుల కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు గారేజ్‌లో ఉన్న ఇద్దరిపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాధితులు అబు హలిఫా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కారు మరమ్మత్తుల కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమతో వాగ్వాదానికి దిగడంతో పాటు దాడికి పాల్పడ్డారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఆర్మీ యూనిఫాంలో ఉన్నాడని, ఈ ఘటనకు సంబంధించిన వీడియో గారేజ్ సీసీటీవీలో రికార్డైనట్టు వారు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వీడియోలోని దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.