కొందరు నన్ను మోసం చేశారు!!

SMTV Desk 2019-10-14 14:31:21  

సినిమాల్లో వేషాలు ఇప్పిస్తామని కొందరు చెబితే, తాను నమ్మి డబ్బులు ఇచ్చానని, వాటిని తీసుకున్న సదరు వ్యక్తులు, ఆపై కనిపించకుండా మాయమై మోసం చేశారని హీరో నికిల్ ఆరోపించారు. ఓ రియాల్టీ షోలో పాల్గొని, తాను సినిమాల్లోకి ప్రవేశించిన తొలి నాళ్లలో ఎదురైన అనుభవాలను వివరించాడు. వారి సినిమాల్లో తనకు పాత్రలను ఇవ్వడం కోసం రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలు అడిగారని, ఆపై తన తండ్రితో మాట్లాడి డబ్బులిచ్చానని నిఖిల్ తెలిపాడు. తనపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తరువాత వాళ్లు కనిపించలేదని అన్నాడు. ఇప్పుడు తనకు అటువంటి పరిస్థితులేవీ ఎదురు కావడం లేదని చెప్పుకొచ్చాడు. కాగా, గత సంవత్సరం నిఖిల్ నటించిన కిర్రాక్ పార్టీ విడుదలైందన్న సంగతి తెలిసిందే.