ప్రియుడి నిర్మాణంలో నయనతార చిత్రం

SMTV Desk 2019-09-16 11:47:06  

ప్రముఖ నటి నయనతార ప్రస్తుతం ..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించింది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదల కానుంది. ‘సైరా’ కంటే ముందు నయనతార నాలుగు సినిమాలు చేసింది. అజిత్‌‌తో ‘విశ్వాసం’, దానితో పాటు ఆమె హీరోయిన్‌ సెంట్రిక్‌‌గా చేసిన ‘ఐరా’, ‘కొలైయుధీర్‌ కాలం’ శివ కార్తికేయన్‌‌తో నటించిన ‘మిస్టర్‌ లోకల్’ చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఓ ‘విశ్వాసం’ తప్ప మిగిలిన మూడు చిత్రాలు నయనతారకు నిరాశనే మిగిల్చాయి.

నయనతార ప్రస్తుతం చిరంజీవితో నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ తో పాటు విజయ్‌తో ‘బిగిల్’.. రజినీకాంత్‌తో ‘దర్బార్’ సినిమాలో యాక్ట్ చేసింది. వీటితో పాటు ప్రియుడు విఘ్నేష్ రౌడీ పిక్చర్స్ నిర్మాణంలో 65వ సినిమాకు ఓకే చేసింది. మిలింద్ రవ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాకు ‘నెట్రికన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో నయనతార అంధురాలి పాత్రలో నటించబోతున్నట్లు ఈ సినిమా పేరును బట్టి చెప్పొచ్చు. ఈ సినిమా పోస్టర్‌ను బ్రెయిలీ లిపీలో రూపొందించడంతో ఈ సినిమాలో నయనతార బ్లైండ్ క్యారెక్టర్ చేస్తుందనే విషయం అర్థమవుతోంది. వచ్చే యేడాది విఘ్నేష్ శివన్‌తో నయనతారతో పెళ్లి పీఠలు ఎక్కనుంది.