అన్నపూర్ణ స్టూడియోస్ లో వైకుంఠపురం సెట్ ..4.5 కోట్ల బడ్జెట్

SMTV Desk 2019-08-21 13:13:57  

అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో వైకుంఠపురం సెట్ వేస్తుందట. దాని కోసం 4.5 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.

సినిమా ఫస్ట్ లుక్ టీజర్ చూస్తే బన్ని ఓ విలేజ్ గాయ్ గా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్ లు నటిస్తున్నారు. వీరితో పాటుగా త్రివిక్రం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం రకుల్, కాజల్ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. 2020 సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న అల వైకుంఠపురములో మరోసారి త్రివిక్రం పెన్ పవర్ ఏంటో చూపించేలా ఉంది.