తృటిలో తప్పించుకున్న రాజ్ తరుణ్

SMTV Desk 2019-08-20 11:36:27  

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డులోని నార్సింగ్ ప్రాంతం అల్కాపూర్ వద్ద మంగళవారం ఉదయం నటుడు రాజ్‌తరుణ్‌కు రోడ్డు ప్రమాదం తప్పింది. రాజ్ తరుణ్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తరువాత రాజ్ తరుణ్ వేరే కారులో వెళ్లిపోయారు. ఈ ప్రమాదం నుంచి అతడు చిన్నపాటి గాయాలతో బయటపడినట్టు సమాచారం. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.