జగన్, బాబు లపై ఫైర్ అయిన కన్నా లక్ష్మీనారాయణ

SMTV Desk 2019-08-17 16:39:08  

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై తీవ్రంగా మండిపడ్డారు. ఓవైపు రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే ప్రజల బాగోగులు పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్ అమెరికా వెళ్లారని కన్నా విమర్శించారు. అదే సమయంలో ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన చంద్రబాబు కొంప మునిగిపోవడంతో ఇప్పుడు హైదరాబాద్ కు జారుకున్నారని ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం వీరిద్దరి తోక నేతలు ‘ఇల్లు మునిగిందా? లేదా?’ అని చర్చ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ ఇంటి సంగతిని వదిలిపెట్టాలనీ, వైసీపీ, టీడీపీ కారణంగా ఏపీ మునిగిపోతుందని హెచ్చరించారు. ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.