వివాహేతర సంబంధం :కుటుంబం బలి

SMTV Desk 2019-08-13 17:12:58  

బెంగళూరు: భర్త వివాహేతర సంబంధం తన భార్య, పిల్లల ప్రాణాలు తీసిన సంఘటన దక్షిణ బెంగళూరులోని హనుమంతనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్ధయ్య అనే వ్యక్తి 18 సంవత్సరాల క్రితం రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు మానష(17), భూమిక (15) కూతుళ్లు ఉన్నారు. సిద్ధయ్య బెస్కమ్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత మూడు సంవత్సరాల నుంచి సిద్ధయ్య మరోక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తన కుటుంబాన్ని పట్టించుకోవడంలేదు. దీంతో కుటుంబంలో పలుమార్లు గొడవలు జరిగాయి. ఇరు కుటుంబాల పెద్దలు సిద్ధయ్యకు భార్య, పిల్లలను మంచి చెడులు చూసుకోవాలని సూచించారు. అలా పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికి అతడిలో మార్పు రాలేదు. దీంతో తల్లీ కూతుళ్లు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రాజేశ్వరీ తలిదండ్రులు పలుమార్లు ఫోన్ చేసినప్పటికి లిఫ్ట్ చేయకపోవడం అనుమానం వచ్చి ఇంటి దగ్గర తలుపుతట్టారు. కిటికీలో నుంచి చూడగా ముగ్గురు ఉరేసుకొని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని తలుపులను బద్దలుకొట్టారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. డిసిపి రోహిణి కటోచ్ సెపత్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చెప్పారు.