అనసూయపై ఆర్జీవీ కన్ను...ఏమీ లేనప్పుడు ఏడవడం ఎందుకు!

SMTV Desk 2019-08-13 17:10:51  

ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ నటించిన తాజా చిత్రం కథనం . అనసూయ ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుని తన లైఫ్‌లో బాధ పెట్టిన విషయాలను షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ...‘నేను ఇలా ఎందుకు ఉండాల్సి వస్తోంది.. ఎందుకు చేయాల్సి వస్తోంది లాంటివి తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రతి వ్యక్తికి కొన్ని ఒత్తిడులు ఇబ్బందులు ఉంటాయి. ఆనందంలో పాటు బాధలు ఉంటాయి. అవేం తెలుసుకోకుండా క్యారెక్టర్‌ గురించి స్టేట్ మెంట్ ఎలా ఇచ్చేస్తారు. నోటికొచ్చినట్టు మాటలు.. చేతికొచ్చినట్టు రాతలు రాసేస్తున్నారు. ఇది ఇప్పుడే కాదు నా కెరియర్ స్టార్టింగ్‌లోనే మొదలైంది. ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కాని తప్పడం లేదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తోంది. ఆయనకు నాకు ఏదో ఉన్నట్టుగా వార్తలు రాశారు. నిజానికి ఆయన చాలా మందికి అర్ధం కారు.. అలాగని నేను స్టేట్ మెంట్ ఇవ్వడం లేదు. వ్యక్తిగతంగా ఆయనకంటూ ఓ స్టేటస్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా నేను బ్యాక్ టు బ్యాక్ ఆయన సినిమాలకు సంబంధించి కొన్ని షోలు చేశా. అప్పుడు నేను యాంకర్‌గా ఫ్రీలాన్స్ మొదలుపెట్టి జస్ట్ రెండు నెలలే అయ్యింది. అప్పుడే యాంకర్‌పై ఆర్జీవీ కన్ను పడింది అని ఆర్టికల్ రాశారు. అప్పటికే నాకు పెళ్లైంది. గర్భవతిగా ఉన్నా.. పిల్లల కోసం చూస్తున్నా. ఆ టైంలో ఈ రూమర్స్ రావడం చాలా బాధించింది. అప్పుడు నా భర్త నాకు ధైర్యం చెప్పారు. వాళ్లు రాసిన దాంట్లో నిజం ఉంటే నువ్ ఏడు.. ఏమీ లేనప్పుడు ఏడవడం ఎందుకు? ఏదైనా నేను నమ్మితే నువ్ బాధ పడాలి అంటూ అని ధైర్యం చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.