ఇసుక కొరత ఎక్కువగా ఉందని ఫీడ్ బ్యాక్

SMTV Desk 2019-08-13 17:07:10  

రాష్ట్రంలో ఇసుక కొరత ఎక్కువగా ఉందని ఫీడ్ బ్యాక్ వస్తోందని సీఎం జగన్ అన్నారు. ఏపీ ప్రభుత్వం కార్యక్రమం ‘స్పందన’పై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, నిర్మాణాత్మకంగా ఇసుక కొరత సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కనీసం 200 రీచ్ ల నుంచి ఇసుకను సరఫరా చేయాలని, సెప్టెంబర్ 5 లోగా ప్రతి రీచ్ లో డంప్ యార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వరదల కారణంగా ఇసుక రీచ్ లన్నీ మూతబడ్డాయని, వరదలు తగ్గగానే మరింత ఇసుక అందుబాటులోకి వస్తుందని ఈ సమీక్షలో పాల్గొన్న జిల్లాల కలెక్టర్లు జగన్ కు వివరించారు.