జీఎస్టీ వసూళ్ళ రికార్డు

SMTV Desk 2017-08-30 14:58:57  GST(GOODS SERVICE TAX), 92,200 CRORES INCOME, FINANCIAL MINISTER ARUN JAITLY.

న్యూఢిల్లీ, ఆగస్ట్ 30 : జులై 1వ తేదీన ప్రారంభమైన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్ళలో రికార్డు స్థాయికి చేరింది. ఈ జీఎస్టీ వసూళ్ళు రూ. 91వేల కోట్లు రావొచ్చని ఆర్ధిక శాఖా అంచనా వేయగా దీనిని అధిగమించి రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 92,200 కోట్లు వసూలు చేసినట్టు ఆర్ధిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ.. మొత్తం 59.57 లక్షలమంది రిజిస్టర్డ్ పన్ను చెల్లింపుదారుల్లో ఇప్పటివరకు 38.38 లక్షల మంది జీఎస్టీ రిటర్న్ దాఖలు చేశారని, ఇక నుంచి జీఎస్టీ వసూళ్ళు ఆలస్యంగా చెల్లి౦చే వారికి రోజుకు రూ. 100 చొప్పున లెవీ విధించనున్నట్టు మంత్రి హెచ్చరించారు. ఇక ముందు ఈ జీఎస్టీ వసూళ్ళ సంఖ్య మరింత పెరగనుందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేసారు.