దూకుడు పెంచిన యువరాజ్

SMTV Desk 2019-07-30 14:35:25  yuvraj,

ఒంటారియో: యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరువాత చిన్న చిన్న లీగ్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. గ్లోబల్ టి20 కెనడా లీగ్‌లో యువీ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. టోరంటో నేషనల్స్ జట్టు తరుఫున ఆడుతున్న యువీ 26 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో 21 బంతుల్లో 35 పరుగులు చేసిన విషయం తెలిసిందే. విన్నీపెగ్‌తో యువీ జంటగా రోడ్రిగో థామస్(65), కీరోన్ పొలార్డ్(52) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వినీ పెగ్ విజయం సాధించింది. కెనడా లీగ్ లోకి వెళ్లినప్పటి నుంచి యువీ ఫామ్ లోకి వచ్చాడు.