రైల్వే స్టేషన్ లోనే ప్రసవించిన మహిళ!!

SMTV Desk 2019-07-03 13:21:37  

నిండు గర్భిణి.. డెలివరీ కోసం ఆస్పత్రికి వెళుతూ.. రైల్వే స్టేషన్ లోనే ప్రసవించింది. కాగా... ఆమెకు కేవలం రూపాయికే ఓ డాక్టర్ వైద్యం అందించాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 29ఏళ్ల ఓ మహిళ నిండు గర్భణి. ప్రసవం కోసం కామా ఆస్పత్రికి వెళ్లేందుకు రైలు ఎక్కింది. ఆస్పత్రికి వెళ్లకముందే నొప్పులు రావడంతో ఆమె డోమ్బివిలి రైల్వే స్టేషన్ లో మగబిడ్డను ప్రసవించింది. కాగా తోటి ప్రయాణికులు ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్, నర్స్ పేషెంట్ కి కేవలం ఒక్క రూపాయికే వైద్యం అందించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. కాగా.. ఈ ఘటన వైరల్ కావడంతో ఆ డాక్టర్ అందిస్తున్న రూపాయి సేవలను అందరూ ప్రశంసిస్తున్నారు.