మరోసారి భేటీకానున్న జగన్ -కెసిఆర్

SMTV Desk 2019-06-25 12:13:10  Jagan , KCr,

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లు మరొకసారి కలవనున్నారు. ఈనెల 28న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవ్వనున్నారు. ఈసమావేశంలో కొన్ని కీలకమైన విషయాలపై చర్చలు జరిపి అంతే కీలకమైన నిర్ణయాలను తీసుకోనున్నారు… ముఖ్యంగా ఏపీ, తెలంగాణ జల వివాదాల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కీలక భేటీ నిర్వహించనున్నారు. అంతేకాకుండా ముఖ్యమైన గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలింపు, లింక్ కెనాల్ వంటి అంశాలపై చర్చిస్తారని సమాచారం.

అయితే ఈ విషయాన్నీ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధిత చర్చలు కూడా అధికారులు ఏర్పాటు చేశారని సమాచారం. కాగా ఈనెల 26 న జగన్ హైదరాబాద్ కి రానున్నారు. తన పనుల నిమిత్తం ఈనెల 29 వరకు కూడా జగన్ హైదరాబాద్ లోనే ఉండనున్నారు. ఈ మధ్యలోనే ఇరు ముఖ్యమంత్రులు కలిసి సమావేశం నిర్వహించనున్నారు. వీరు కలిసాక కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి జలవివాదాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం.