24 గంటల వ్యవధిలో 9 హత్యలు

SMTV Desk 2019-06-24 13:36:47  murder, delhi,

ఢిల్లీలో వరుస హత్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. 24 గంటల వ్యవధిలో 9 హత్యలు జరగడం పోలీసుల నిర్లక్ష్యంగా అభివర్ణించారాయన. ఢిల్లీ వాసుల రక్షణకు ఎవరి తలుపులు తట్టాలంటూ ట్వీట్‌ చేశారు. కేజ్రీ ట్వీట్ పై రియాక్ట్‌ అయిన పోలీస్‌ డిపార్ట్‌ మెంట్ ..తమ గణాంకాల ప్రకారం రాజధానిలో నేరస్థుల సంఖ్య తగ్గిందని పేర్కొంది. వృద్ధులపై దాడులు 22 శాతం తగ్గాయని .. ఇదంతా ఢిల్లీ పోలీసుల ప్రయత్న ఫలితమేనని పేర్కొంది. కేజ్రీవాల్ పేర్కొన్న హత్యలకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని వెల్లడించింది.