ఐపిఎల్ వల్లే ఓడిపోయాం!

SMTV Desk 2019-06-24 13:28:12  fa du plessis

లండన్: ప్రపంచకప్ సిరీస్ లో దక్షిణాఫ్రికా పరాజయపాలవడంతో ఆ జట్టు కాప్టెన్ డూప్లిసెస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపిఎల్‌లో ఆడటం వలన తమ దేశపు ఆటగాళ్లు బాగా అలసిపోవడంతో వరల్డ్ తమ జట్టు విఫలమైందన్నారు. ఐపిఎల్‌లో తమ ఆటగాళ్లు ఆడడంతోనే వరల్డ్ కప్ లో రాణిస్తలేరని చెప్పుకొచ్చాడు. రబడ తన బౌలింగ్‌లో విఫలం కావడంతో సఫారీ జట్టు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. రబడ ఆరు మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టి ఘోరంగా విఫలమయ్యాడని చెప్పుకొచ్చాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 49 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు మ్యాచ్‌లు ఆడిన సఫారీ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్లే ఆఫ్ ఆశలు నీరుగారిపోయాయి. లీగ్ దశలోనే తమ జట్టు ఇంటి బాట పట్టడం బాధాకరమైన విషయమని చెప్పుకొచ్చాడు. ఐపిఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన రబడ మంచి పదర్శన చేశాడు. 12 మ్యాచ్‌లాడిన రబడ 25 వికెట్లు పడగొట్టాడు. ఐపిఎల్‌లో ఆడిన స్టెయిన్స్‌కు గాయం కావడం జట్టుకు పెద్ద దెబ్బ తగిలిందన్నాడు. ఏదేమైనా వరల్డ్ కప్ వచ్చిదంటే చాలు శని దక్షిణాఫ్రికా మీదనే ఉంటుందని నెటిజన్లు వాపోతున్నారు.