రేప్ కేసు పెట్టిన మహిళను పెళ్లాడిన ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర పార్టీ ఎమ్మెల్యే

SMTV Desk 2019-06-11 17:25:48  

త్రిపుర రాష్ట్రంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తనపై రేప్ కేసు పెట్టిన మహిళనే పెళ్లాడారు అధికార ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర పార్టీ ఎమ్మెల్యే ధనంజోయ్. రాష్ట్రంలోని దలాయి పట్టణానికి చెందిన మహిళ మే 20న త్రిపుర రాజధాని అగర్తలలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ధనంజోయ్‌పై రేప్ కేసు పెట్టింది.

తనను శారీరకంగా లొంగదీసుకుని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరం కొంతకాలం ప్రేమించుకున్నామని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ముందస్తు బెయిలు కోసం ధనంజోయ్ ప్రయత్నించగా… కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో చేసేదేమిలేక తనపై కేసు పెట్టిన మహిళను వివాహం చేసుకున్నారు. అగర్తలలోని చతుర్‌దాస్ దేవతా ఆలయంలో వీరి వివాహం జరిగినట్టు ధనంజోయ్ తరపు న్యాయవాది తెలిపారు.