ఉత్తర ప్రదేశ్‌లో దుమ్ము తుపాను బీభత్సం….

SMTV Desk 2019-06-07 17:11:05  dust , up,

లక్నో: దుమ్మ తుపాను బీభత్సం సృష్టించడంతో 19 మంది చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…. దుమ్ము తుపాను భారీ ఎత్తున ఎగసిపడడంతో ఇండ్లు, చెట్లు కూలిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడడంతో 48 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు స్థానికి ఆస్పత్రికి తరలించారు. మెయిన్‌పురిలో ఆరుగురు, ఇతాలో ముగ్గురు, కస్‌గంజ్‌లో ముగ్గురు, మోరదాబబాద్, బదౌన్, కన్నౌజ్, సాంభల్, ఘజియాబాద్‌లో ఒక్కొరు చొప్పున మృతి చెందారు. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధితులకు త్వరగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మృతులకు సంతాపం తెలిపడంతో పాటు మృతుల కుటుంబాలకు యోగి సానుభూతి ప్రకటించారు.